Satya7 Kadiyam

𝚃𝚑𝚎 𝙻𝚊𝚠 𝚘𝚏 𝙰𝚝𝚝𝚛𝚊𝚌𝚝𝚒𝚘𝚗.. 

1 🌌 హనుమాన్

12 ఏళ్ల అబ్బాయి దుప్పటి కప్పుకుని ఉంటాడు

అమ్మ: {చేతులు మాత్రమే కనపడతాయ్} సత్య సత్య సత్య నాన్న లే రా స్కూల్ కి టైమ్ అవుతుంది
బాబు: దుప్పటి కపుకుని ఉంటాడు
{ముఖం కనపడదు}
ఉండమ్మా ఒక 5 నిముషాలు లో లేస్తా

టిక్ టిక్ మని
4 సార్లు సెకండ్స్ ముల్లు కొట్టుకున్నాక

బాబూ 5 నిమిషాల్లో లేస్తా అన్నావ్ పావుగంట అయింది

బాబు: ఇంకో 2 నిమిషాలు అమ్మ

టిక్ టిక్ మని 4 సార్లు కొట్టాక
టిర్ర్ర్ర్ర్ మని అలారం⏰ మోగుతుంది

వాకిట్లో కళ్లాపి వేస్తున్న అమ్మ అలారం సౌండ్ విని
రేయ్ సత్తీ అని అరిచి చెంబు నేలకేసి కొట్టి
టైం చూడరా, ఇవాళ కాని స్కూల్ ఎగ్గొట్టావ్ అంటె చీపిరి కట్ట తిరగేస్తాను

కెమెరా టాప్ లో Fan view లో ఉంటాది
దుప్పటి ఒకేసారి పైకి విసిరేస్తె
కెమెరా క్లోస్ అవుతాది

Open చేస్తే
90’s విజువల్ 🏞, ఒక మట్టి రోడ్డు 🏜
అటు ఇటు చెట్లు 🌳🌲🌴
స్క్రీన్ పై 2010 అని వస్తాది
సైకిల్ 🚲 పై ఒక విద్యార్థి సర్రుమని పోతాడు (యూనిఫాం🥼 బ్యాగ్ 🎒 వేస్కొని)

అపుడు కెమెరా right top నుండి left down కి వస్తే 5 కి.మీ మైల్ స్టోన్ కనిపిస్తాది


బాబు: క్లాస్ రూం డోర్ దగ్గరకు వచ్చి may i come in mam అంటాడు
మేడమ్: ఈరోజు కూడ లేట్ ఏనా? తగలడు

బాబు బ్యాగ్ తీస్తూ లోపలికి వస్తాడు

బ్యాగ్ పట్టుకుని బెంచ్ మీద కూర్చుంటే
బెంచ్ మేట్: ఏరా? ప్రసాద్ గాడు రాలేదా?
బాబు: లేదురా వాడి గురించి తెల్సు కదా అంటాడు


కిటికీలో నుండి చూస్తే సూర్యాస్తమయం 🌅 అవుతుంది
స్కూల్ బెల్ 🔔 మోగుతుంది
అందరు బ్యాగులు తీస్కుని డోర్ వరకు వెళ్ళాకా


మేడమ్: రే సత్య అని పిలుస్తే
బాబు: ఏంటి మేడమ్ అంటాడు
మేడమ్: బుక్ ఇస్తూ ఈ లెక్క సాల్వు చేసి వెళ్లు అని ఎగ్జామ్ పేపర్స్ కరెక్ట్ చేస్తు ఉంటాది

బాబు: మేమ్ లేట్ అవుతుంది రేపు చేస్తా అంటే
మేడమ్: లేట్ గా వచినపుడు లేదా? ఇపుడు చేసి వెళ్లు అంటాది

బుక్ 📕 ఓపెన్ చేసి రాయటం మొదలు పెడతాడు
మేడమ్ పేపర్స్ అన్నీ కరెక్ట్ చేసేసి సీరియస్ 🤔 గా చుస్తాది
బాబు: ఇంకా రాస్తూ ఉంటాడు


మేడమ్ విసుక్కుంటూ మొబైల్ లో📱 టైం ⌚ చూస్తే రాత్రి 7:00 PM ఉంటుంది
అదే F24 లోకి బుక్ 📕 వస్తాది
కట్ చెయకుండా అలా బాబు ఫేస్ కి చూస్తె
బాబు: అయిపోయింది మేమ్ అంటాడు

మేడమ్: బుక్ తీస్కుంటది ఓపెన్ చేసి చూసి,
ఏంట్రా.. అన్నీ తప్పులు రాసావు? అని కోపం గా అడుగుతాది
బాబు: చేతులు కట్టుకుని ఉంటాడు

మేడమ్: రేపు చెప్తా నీ పని అని హ్యాండ్‌బ్యాగ్ 👜 వేసుకుని వెళ్లిపోతాది

బాబు: వెళ్లి బ్యాగ్ తీస్కుని బయటకి వెళ్లిపోతాడు
బయటంతా చీకటి గా ఉంటాది
బాబు: సైకిల్ 🚲 స్టాండ్ తీసి తొక్కుకుంటూ పోతాడు

సడెన్ గా సౌండ్ వస్తుంది
బాబు: కింద చైన్‌ చూస్తూ సైకిల్ ఆపుతాడు

సైకిల్ చైన్ లో చెయ్ పెట్టి ఛ.. చైన్ తెగిపోయింది అని నుంచుంటాడు
ఇక నడిపించుకునే వెళ్లాలి అని వెళతాడు

సత్య కి భయంకరమైన శబ్దాలు వినపడతాయ్
భయం తో హఠాత్తుగా ఆగుతాడు

ఒక చేత్తో లాకెట్ ఒక చేత్తో సైకిల్ పట్టుకుని
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ మెల్లగా వెళ్తాడు

ఎక్కడో నక్కలు అరుస్తున్న శబ్దాలు వస్తాయ్

ఆగిపోయి ఎడమవైపు చుస్తాడు
కొంచెం ముందు రోడ్డు పక్కనే ఉన్న చెట్టు దగ్గర
చిన్న గుడిలో హనుమాన్ విగ్రహం ఉంటుంది
త్వర త్వరగా అక్కడికి వెళ్తాడు.

సైకిల్ స్టాండ్ వేసి వెళ్లి
అక్కడే మెట్ల దగ్గర గట్టు పై
ఒక పక్కన కూర్చుంటాడు

సత్య పక్కన చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద వెలుగు వెలిగి అందులో నుండి హనుమాన్ మనిషి రూపం లో వస్తే మళ్లీ లైట్ చిన్నగా అవుతూ మాయం అయిపోతుంది

సత్య ఎడమవైపు చూస్తూ కూర్చుంటే
కుడిపక్కన ఏదో అలికిడి అనిపించి

మెల్లగా ఎడమవైపు నుండి కుడివైపునకు తిరిగి
ఉలిక్కి పడి భయం తో గట్టు దిగేసి చూస్తాడు

సత్య: ఎవరు నువ్వు అంటాడు
హనుమాన్: నేను రామ భక్తుడ్ని
నువు ఈ టైమ్ లో ఇక్కడేం చేస్తున్నావ్

సత్య: స్కూల్ లో క్లాస్ అయ్యేసరికి లేట్ అయింది
ఈ చీకటిలో ఇంటికి వెళ్లాలంటే భయం గా ఉందీ
హనుమాన్: ఐతే ఇక్కడే ఉండిపో రేపు ఉదయం వెళ్లు

సత్య: అమ్మ కంగారు పడుతుంది వెళ్ళాలి అంటాడు
హనుమాన్: నీకు భయం వేయట్లేదా…?

సత్య: (అటు వైపు చీకటిని చూసి కొంచెం భయం తో) వేస్తుంది కానీ వెళ్ళాలి అమ్మ కోసం అంటాడు

హనుమాన్: ఐతే దేవుడి కి దండం పెట్టుకుని వెళ్ళు నీలో భయం పోతుంది

సత్య: విగ్రహం ని చూస్తు మెట్లు ఎక్కుతాడు,
అక్కడ Orange 🟠 కలర్ బొట్టు పెట్టుకుని
కళ్ళు మూసుకుని దండం పెడతాడు

సత్య కళ్ళు మూసుకున్నాక హనుమాన్ వచ్చి
సత్య కి విగ్రహం కి మద్య నుంచుని ఉంటాడు
విగ్రహం హనుమాన్ సత్య ఒకే వరస లో ఉంటారు

హనుమాన్ చేయి చాపి ఆశీర్వదిస్తే
హనుమాన్ చేతి నుండి సత్య తల పై ఆశీర్వాదం కాంతి పడుతుంది

కాంతి పడగానే సత్య వెనుక నుండి Orange 🟠 కలర్ బయటకి వస్తుంది సూపర్ ఫాస్ట్ గా

ఆ స్పీడ్ కి సైకిల్ 🚲 కింద పడిపోతుంది
కింద పడిన సౌండ్ వస్తుంది
Orange 🟠 కలర్ వేగంతో రోడ్డు మీద ఒక పిల్లోడు పడతాడు

సత్య సౌండ్ కి వెనక్కి తిరిగి చూస్తే
రోడ్డు పైనా పిల్లోడు చేతికి ఉన్న మట్టి ని దులుపు కుంటాడు

సత్య విగ్రహం వైపు తిరుగుతుంటే
మద్యలో ఉన్న హనుమంతుడు మెల్లగా మాయం అయిపోతాడు

సత్య: రామ భక్తుడు ఎక్కడకి పోయాడు అనుకోని మెట్లు దిగి వచ్చి సైకిల్ 🚲 పైకి లేపుతూ
ఎవరు నువ్వు అంటాడు

పిల్లోడు: నా పేరు సాయి ఈ చీకటి చూస్తే భయంగా ఉంది
సత్య: భయపడకు నాతో రా అంటాడు

సత్య సైకిల్ 🚲 నడిపిస్తూ సాయి పక్కన నడుస్తూ వెళతారు

[[సత్యలో భయం పూర్తిగా పోయింది అనే hallucination లో ఉంటాడు]

<< 𝗣𝗿𝗲𝘃 1 𝟮 𝟯 𝟰….𝗡𝗲𝘅𝘁>>

01 Hanuman
02 Satya
03 Shiva
04 Curse
05 Proposal
06 Hospital
07 Kidnap
08 Thalli, pilla
09 Finding home with feelings
10 Clarity
11 Para shakti
12 Climax

Jai Durga maa 🔱
Satya 7’s street
Satya 7’s apartments
Satya 7’s road
Peddapuram, Andhra pradesh 533437
India🇮🇳