
3 🌌 శివ
రోజు 1
(స్క్రీన్ పై 15 ఏళ్ల తర్వాత అని వస్తుంది)
సత్య బైక్ పై ఎంట్రీ ఇస్తాడు రోడ్ పై వెళుతుంటే వాయిస్ ఓవర్ స్టార్ట్ అవుతుంది (చిన్నపుడు అంత బ్రిలియంట్ గా చదివాక తల్లిదండ్రులు & ఇంగ్లీష్ టీచర్ వీడు పెద్దయ్యాక worldwide businessman అవుతాడు లేదా పెద్ధ scientist అవ్వి space లోకి వెళ్తాడు లేదా politics లోకి వెళ్లి జనం కోసం ఫైట్ చేస్తాడు అనుకుంటారు కానీ.. మీరే చూడండి)
సత్య వాళ్ల మావయ్య పేరు శ్రీను (శ్రీనివాసరావు)
శ్రీను: అరేయ్ సత్య అక్క నీకు ఏదో ఉద్యోగం చూడమని అంది
ఇప్పటి వరకు 5 జాబ్స్ లో జాయిన్ చేస్తే నీకున్న తొందరపాటు రోగం వల్ల
జాయిన్ అయిన మొదటి రోజే నిన్ను ఉద్యోగం లోనుంచి తీసేసారు
ఇధి 6వ సారి 50వేలు జీతం కనిసం
ఈ ఉద్యోగం అయినా సరేగా చెయ్యరా
సత్య: సరే మావయ్యా అని జాబ్ కి కంగారుగా బయలుదేరతాడు
శ్రీను: సర్టిఫికెట్లు వదిలేసావ్
సత్య: తీస్కోని thanks మాయ
శ్రీను: కొంచం ఆ కంగారు తగ్గించుకోరా
సత్య: ఆఫీస్ కి బయలు దేరతాడు కంగారు గా వెళ్ళేటపుడు ఇంటి బయట పిల్లలు ఆటలు ఆడుకుంటారు
బైక్ కోసం పార్కింగ్ దగ్గరకి వెళ్తుంటే
ఒక పిల్లోడు: సత్య అంటే
సత్య ఆగుతాడు
పిల్లోడు: నీకో జోక్ చెప్పనా
సత్య: చెప్పరా
పిల్లోడు: ఏదొక జోక్ చెప్తాడు
సత్య: హహహ అని ఇద్దరు నవ్వుకుంటారు
పిల్లోడు: పద క్రికెట్ ఆడదాం అంటే
సత్య: సరే పద అంటాడు
పిల్లోడు: ఆ బ్యాగ్ ఏంటి
సత్య: (కొంచం డిసప్పాయింట్ అయ్యి) ఓహ్ సారీ రా కంగారు లో మార్చిపోయా డ్యూటీ లో జాయిన్ అయ్యా వెళ్ళాలి అని వెళ్లి పోతాడు
వెళ్ళే దారిలో ట్రాఫిక్🚦 లో ఆగుతాడు
సమయం⌚ చూసుకుని విసుక్కుంటాడు
పక్కన చూస్తే గట్టు పైన
ఒక యువ ముష్టి వాడు పడుకుని ఉంటాడు
జాలి వేస్తుంది పక్కకి చూస్తే
స్కూటీలో స్కార్ఫ్ కట్టుకుని ఒక అమ్మాయి కూడా చూస్తుంది
సత్య: తను ఏం చేస్తాదా అని చూస్తాడు
Scarf girl: స్కూటీ దిగి డిక్కీ ఓపెన్ చెస్తే కవర్ లో
అరటి పళ్ళు, కొబ్బరికాయ, అగర్బత్తి ఉంటాయి అవి తీస్కువెళ్లి వాడిని డిస్టర్బ్ చేయకుండ తల దగ్గర పెట్టేసి స్కూటీ దగ్గరకి వెళ్తుంది
సత్య: చాల హ్యాపీ ఫీల్ అవుతాడు
సిగ్నల్ 🚦 రావటం తో అందరు వెళ్లిపోతారు
సత్య Scarf girl ని ఫాలో అవుతాడు
ఫోన్ రింగ్ అవుతుంది ఫాలో అవుతూనే
ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు
శ్రీను హాఫ్ ఫ్రేమ్ కి వస్తాడు
శ్రీను: అరేయ్ ఎక్కడ రా ఆఫీస్ కి వెళ్ళావా?
సత్య: ఆహ్ వెళుతున్నా అంటూ స్మైలీ ఫేస్ పెడతాడు శ్రీను: ఇది మిస్ చేసావ్ అంటే మీ అమ్మ కి చెప్తా
సత్య: ఏం చెప్తావ్
శ్రీను: నీ కొడుక్కి జాబ్ చూడటం నా వల్ల కాదు తీస్కెళ్లిపో అని చెప్పేస్తా ఇక నీ ఇష్టం అని కాల్ కట్ చేస్తాడు
సత్య కి ఫేస్ లో ఆనందం పోయి టెన్షన్ వస్తుంది
టెన్షన్ లో బ్రేక్ వేసి బైక్ ఆపి స్కూటీ నెంబర్ చుస్తాడు 1234 అనుకుని టైమ్⌚ చూసి ఓహ్ గాడ్ అని యూటర్న్ తీసుకుంటాడు
(ఇక్కడ కంగారు ఆపుకుని డ్యూటీ కి వెళ్ళాడు)
కట్ చేస్తే ✂✂✂✂✂ ఆఫీస్ కి వస్తాడు
రిసెప్షన్ కి వెళ్లి న్యూ అడ్మిషన్ అంటాడు
రిసెప్షన్ గర్ల్: సార్ ని కలవండి అని రూమ్ వైపు వేలు చూపిస్తుంది
ఒక గ్లాస్ రూం లో HR తో మాట్లాడుతాడు
ఆడియన్స్ కి వినపడదు నో ఆడియో
సత్య కుర్చీలోంచి లేస్తూ ఫైల్ తీస్కుంటాడు
ఇప్పటి దాకా సత్య బాగానే ఉంటాడు అంతా బాగానే ఉంటుంది కానీ
డోర్ ఓపెన్ చేసి చూస్తే
అందరూ ఎవరి పని లో వాళ్ళు బిజీ గా ఉంటారు ఫాస్ట్ ఫార్వర్డ్ ⏩ లో పని చేస్తారు
సత్య: OMG మొహం పెట్టి నేనే అనుకున్నా అందరు (ఎలుక రేసులో ఉన్న వాడిని ఏమంటారు) అనుకుని బయటకి వచ్చి తలుపు మూసేస్తాడు.
(ఇక్కడ సత్య కి ఉద్యోగం చెయ్యడానికి ఉన్నా సమస్య తెలుస్తుంది)
వెళ్లి సీట్ లో కూర్చుంటాడు పక్కన
సహోద్యోగి: హాయి అంటాడు
సత్య: హై అని చెయ్ లాక్కుని షేక్‌హాండ్ ఇస్తూ అయామ్ సత్య మీరు? అని నవ్వుతాడు
సహోద్యోగి: చెయ్ లాక్కుని
నీకు కొంచెం స్పీడ్ ఎక్కువ అనుకుంటా
సత్య: ఏదో కొంచెం అంటాడు
వాళ్లిద్దరి మద్య డెస్క్ మీద దబ్..మని ఒక 100 ఫైల్స్ పెడతారు
ఇద్దరు షాక్ తో చుస్తే
ఆఫీస్ బాయ్: సార్ మీ ఇద్దరినీ ఇవి ఫినిష్ చేయ మన్నారు అంటాడు
సత్య: ఇష్టం లేనట్టు ముఖం పెట్టి పని స్టార్ట్ చేస్తాడు వెనక గడియారం 🕘 లో ఉదయం 9 గంటలు అవుతుంది F 51, F 52, F 53 3 గంటలకి 30 ఫైల్స్ చొప్పున 3 షాట్స్ లో అయిపోతయ్
🕕 సాయంత్రం 6 గంటలకు అవుతుంది
అందరు టైం అయిపోయింది అని వెళ్లిపోతూ ఉంటారు HR: వచ్చి టైం అయింది వెళ్ళండి
సహోద్యోగి: ఫైల్ క్లోజ్ చేసి సిస్టమ్ షట్‌డౌన్ చేస్తాడు సత్య: ఇంకా 10 ఫైల్స్ ఉన్నాయ్ కదా అని ఒక ఫైల్ తీస్తుంటే
HR: (ఆ ఫైల్‌ని చెయ్‌తో నోక్కి) కుదరదు వెళ్లిపోవాలి రేపు వచ్చి చెయ్యాలి అంటాడు
సత్య: (కోపం గా లేచి) బ్యాగ్ 💼 తీస్కుంటాడు (ఇష్టం లేనపుడు చెయ్యలేక ఇష్టం ఉన్నప్పుడు మనలేక ఇద్దరు పడ్డాడు) (ఇక్కడ కూడా ఉద్యోగం చెయ్యడానికి ఉన్నా సమస్య తెలుస్తుంది)
HR: సిస్టమ్ ఎవరు షట్‌డౌన్ చేస్తారు
సత్య: షట్‌డౌన్ చేసి ఫాస్ట్ గా బయటకి వస్తాడు ఫాస్ట్..గా పార్కింగ్ ప్లేస్ చూసి షాక్ అవుతాడు
అందరు ఒకేసారి కార్లు బైకులు తీస్కోని వెళతారు అది చూసిన సత్య కి రేసింగ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది
బైక్ తీసి కిక్ కొడతాడు
కట్ చెస్టే ✂✂✂✂
బైక్ స్టాండ్ వేసి ఇంటి లోనికి వెళ్ళతాడు
శ్రీను: ఏరా మొదటి రోజు ఎలా ఉంది?
సత్య: ఏం మాట్లాడకుండా గది లోకి వెళ్లి తలుపు వేసుకుంటాడు
శ్రీను: ఏమైంది వీడికి అంటాడు హాల్ లో టేబుల్ పై మందు బాటిల్ పెట్టుకుని తాగుతూ ఉంటాడు
సత్య వచ్చి ఎదురుగా కూర్చుంటాడు
శ్రీను అనుమానంగా చూస్తాడు
సత్య: ఫాస్ట్ గా ఒక పెగ్ వేసుకొని తాగుతాడు
శ్రీను: రేరేయ్ అది రా రా అంటాడు
సత్య: గ్లాస్ టేబుల్ పై గట్టిగా పెడతాడు
శ్రీను: ఏమైంది రా అంటాడు గట్టిగా
సత్య ముఖం జూమ్ చేసి కట్ ✂చేస్తే
స్క్రీన్ పైన 2 గంటల ముందు అని వస్తుంది
సత్య బైక్ పై స్లో గా వెళ్తుంటే
ఎదురుగా ఎవడో ఒకడు నడుస్తూ రోడ్డుపైన పడిపోతాడు
సత్య: చేత్తో హేయ్ అని బైక్ ఆపి దగ్గర కి వెళ్లి చూస్తాడు
పక్కన 4 మంది కూడా వచ్చి చూస్తారు
వాడికి కడుపు లో కత్తి ఫుల్ బ్లడ్ ఉంటాది help కాపాడండి అంటాడు
సత్య & ఒక కుర్రాడు ఒకేసారి మొబైల్స్ తీసి అంబులెన్స్ 🚑 కి కాల్ చేయబోతే వాళ్ల అన్న ఆ కుర్రాడిని
అరేయ్ తముడు ఏం చేస్తున్నావ్
చూశావ్ గా కడుపులో కత్తి ఇది మర్డర్ కేసు
మంచి కి వెళితే చెడు ఎదురు అవుతుంది మనకి ఎందుకు రా ఇవన్నీ పోదాం పద అని భుజం పై చేయి వేసి తీస్కెళ్తాడు
సత్య కూడా 1 సెకను ఆలోచించి మొబైల్ జేబులో పెట్టేస్తాడు
అకస్మాత్తుగా Scarf girl వస్తుంది
చూస్తే వాడు సహాయం అంటాడు
Scarf girl: అసలు మీరు మనుషులు లేనా? ప్రాణం పోతుంటే చూస్తూ ఉంటారా? అని
మొబైల్ తీసి హలో పోలీస్ స్టేషన్ అంటది
సత్య ముఖం కనిపించకుండా చెయ్యి అడ్డు పెట్టుకుని అక్కడ నుండి వెళ్లిపోతాడు
కట్ చెస్టే✂✂ ప్రస్తుతం
శ్రీను: పెగ్ తాగుతూ ఉంటాడు గ్లాస్ టేబుల్ పై పెట్టి:
so what రా మొత్తానికి బతికాడు కదా…
సత్య: చచ్చేలా ఉన్నాడు అంట బతికితే పర్లేదు లేకపోతే అనవసరం గా ఒక అమ్మాయి ని లాగుతారు శ్రీను: ఎవరో అమ్మాయి ని లాగితే నువ్ టెన్షన్ పడతావ్ ఏంట్రా
సత్య: ఒక అమ్మాయి ప్లేస్ లో నేను ఉండాలి
శ్రీను: అహూ అహూ అని పొలమరుతాడు
సత్య: ముందు నేను కాల్ చేద్దాం అనుకున్నా పోలీస్ కి మళ్లి మనకెందుకు లే అని
శ్రీను: మంచి పని చేసావ్ అంటాడు
సడెన్ గా కరెంట్ ⚡పోతాది
సత్య: క్యాండిల్🕯 వెలిగిస్తాడు
శ్రీను: నువ్వు చేసింది కరెక్ట్ రా ఫస్ట్ నీకు హెల్ప్ చేయమని చెప్పింది కదా అది నీ మనసు
తరవాత నీ నిర్ణయం తప్పు అని చెప్పింది కదా అదే నీ మెదడు ఈ మనసు అందర్నీ ము ము ము
సత్య: మాయ అని అరుస్తాడు
శ్రీను: మూర్ఖుల్ని చేస్తాది కాబట్టీ ఎపుడు మెదడు చెప్పేది మాత్రమే వినాలి
సత్య: అది నాకు తెల్సు కానీ…
శ్రీను: కానీ? ఎట్రా
(ఇక్కడ పాట వస్తాది శివుడిని మనసు గురించి అడుగుతూ)
అలా బయటకి వచ్చి డ్యాన్స్ వేసి పాట అయ్యేసరికి ఫుల్ గా తాగేసి వస్తూ వస్తూ దారిలో ఒక గుడి దగ్గర కూర్చుంటాడు
సత్య పక్కన ఒక అఘోర గంజాయి స్మోక్ చేస్తాడు
అతనికి వళ్లంతా విభూది మెడలో పెద్ద మాల 📿 ఉంటాది
సత్య: అఘోరని చూసి ఫుల్ బాటిల్ పైకెత్తి కొంచెం తాగి నీ పని బాగుందిరా బాబు అంటాడు
అఘోర: ఇపుడు నీకే సమస్య వచ్చింది
సత్య: నా సమస్య ఏంటో నాకే అర్దం కావట్లేదు నా మైండ్ జాబ్ కి వెళ్ళమని చెప్తుంది నా మనసు లైఫ్ ని ఎంజాయ్ చేయమని చెప్తుంది
ఈ కన్ఫ్యూజన్ నా వల్ల కావట్లేదు అని గట్టు దిగి నిలబడతాడు
ఇష్టం అయింది చెయ్యలేక
ఇష్టం లేనిది మానలేక (మందు సీసా పైకి లేపి చూస్తు)
ఏం చేస్తున్నానో అర్దం కాక
నా తొందర పాటు లో చేసిన తప్పుల వల్ల ఇప్పటి దాకా 5 ఉద్యోగాలు మానేసా
Actual గా వాళ్లే దొబ్బేయ్ మన్నారు అదే నా సమస్య
నాకు excitement ఎక్కువైతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు
అఘోర: ఐతే ద్యానం చెయ్ నీ కంగారు కంట్రోల్ లో ఉంటది నీ తొందరపాటు తగ్గిపోతాది అంటాడు
సత్య: ఏంటి ద్యానమా? నా సమస్య నీకు అర్దం కాలేదా?
కుదురుగా ఒక చోట కూర్చోలేను
ప్రశాంతం గా పడుకోలేను
ఇంక ద్యానం ఎలా చెయ్యగలను
దీనికి ఒకటే మార్గం
కంగారు మీద కంట్రోల్ కాదు నాలో నుంచి ఈ కంగారు పూర్తిగా పోవాలి అని అఘోర వంక చూస్తాడు
అఘోర: సీరియస్ గా చుస్తాడు
సత్య: చెప్పు జరుగుతాదా జరుగుతాదా అని తూలుతు ఊగుతాడు
అఘోర: జరుగుతాది నీ తొందరపాటు నీలో నుండి పూర్తిగా తొలిగి పోతాది అని ఆశర్వాదిస్తాడు
అపుడు అఘోర మెడలో మాల 📿 పాము లా మరి 🐍 పడగ విప్పుతుంది
సత్య: చూసి బయపడి ఎహ్ పామ్ పామ్ అని అక్కడి నుండి పారిపోతాడు
(ఇక్కడ ప్రేక్షకులకు అఘోర శివుడు అని తెలుస్తుంది)
సత్య రోడ్డు మద్యలో అడ్డంగా నడుస్తూ ఉంటాడు ఎదురుగా లారీ 🚛 హారన్ 📯 కొట్టుకుంటూ వస్తాది దగ్గర కి వస్తుంటే
సత్య: చెయ్యి అడ్డు పెట్టుకోని లారీ లైట్లు 💡💡 చుస్తాడు
హఠాత్తుగా ఒక Blue 🔵 కలర్ వచ్చి కాపాడుతుంది బాటిల్ పగిలిపోద్ది దెబ్బకి తాగింది మొత్తం దిగిపోద్ది సత్య కి
ఎవడ్రా నను కాపాడింది అని చూస్తే వాడు తాగేసి ఊగుతు ఉంటాడు Blue 🔵 కలర్ లో
సత్య చొక్కా ని దులుపుతూ నీకేం కాలేదు గా అంటాడు (వాడు ఎవడో కాదు సత్య లోని కంగారు గాడు లారీ 🚛 ప్రమాదంలో సత్య లోపల నుండి బయటకి వచ్చేస్తాడు) ఆ విషయం ఇద్దరికీ తెలీదు ప్రేక్షకులకు మాత్రమే తెలుస్తుంది
సత్య: thank you bro
ప్రసాద్: హే, ఊరికి కొత్తరూమ్ కావాలి
సత్య: ఊరికి కొత్తరూమ్ ఆహ్?
ప్రసాద్: నేను ఊరికి కొత్త నాకు రూమ్ కావాలి
సత్య: నా ప్రాణాలు కాపాడావ్ నా రూమ్ లో ఉండు bro అని తీస్కెళ్తాడు
శివుడు వరం ఇచ్చాడు సత్య లో నుండి సత్య కంగారు పోయింది కాబట్టి చాల కూల్ గా emotional intelligence గా ఉంటాడు
ఇంకా చాలా ఉంది….





